డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మహిళా దినోత్సవ వేడుకలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ సమన్వయ కేంద్రం, కరీంనగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

వేడుకలను ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ, మహిళలు విద్య, ఉద్యోగ రంగాలతో పాటు అన్ని సామాజిక రంగాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి కృషిని గుర్తించి గౌరవించాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతకు, సమానత్వానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె ఉద్బోధించారు.