స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు.
ఉమ్మడి రాష్ట్రంతోపాటు ప్రత్యేక తెలంగాణలోనూ మున్నూరుకాపులకు పాలక ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మున్నూరుకాపులు బీఆర్‌ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ నుంచి 2023లో ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారని తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనం కోసం కోట్లాది రూపాయల విలువైన స్థలంతోపాటు నిధులను కేటాయించారని, నాటి సీఎం కేసీఆర్‌కు మున్నూరుకాపులంటే ప్రేమ ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడా పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్నూరుకాపులే కాదు, బీసీల అణచివేత కొనసాగుతుందని విమర్శించారు. మొక్కుబడిగా కార్పొరేషన్ ప్రకటించినా, రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వానికి అడ్డంకి ఏమున్నదని ప్రశ్నించారు. బీసీ రాజ్యాధికారం కోసం జరిగే ఉద్యమంలో మున్నూరుకాపులు అగ్రభాగాన నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభా లో 15 నుంచి 20 శాతం ఉన్న మున్నూరుకాపులను కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర శాతానికి పడేసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ