చల్ల స్వరూప రాణి ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక పనులు ప్రారంభం

పట్టణ ప్రణాళికలో భాగంగా కరీంనగర్ 37వ డివిజన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. నూతన కరెంటు స్తంభాలను ఏర్పాటు చేసేందుకు ఆమె కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డివిజన్‌లోని అన్ని షాపులలో ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని సూచించారు. అనంతరం ఆమె డివిజన్‌లోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, స్థానిక సమస్యలను గుర్తించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు, సంబంధిత అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డివిజన్ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా అధికారులు, ప్రజలు తెలిపారు.