బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నేడు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జి.వి. రామకృష్ణారావు గారు జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు గారు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చల్ల హరిశంకర్ గారు, కరీంనగర్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ గౌడ్ గారు, శ్రీ ఏనుగు రవీందర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వీర్ల వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు.

అలాగే, కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ శ్రీమతి పిల్లి శ్రీలత మహేష్ గారు, కొత్తపెల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ రుద్రరాజు గారు, మాజీ కార్పొరేటర్లు శ్రీమతి గందె మాధవి మహేష్ గారు, శ్రీమతి గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ కుర్ర తిరుపతి గారు, శ్రీమతి సుధగోని మాధవి కృష్ణ గారు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ రెడ్డవేణి మధు గారు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కొత్తపెల్లి మండల ప్రెసిడెంట్ శ్రీ కాసారపు శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం ప్రశాంత్ రెడ్డి గారు, టీఆర్ఎస్వీ నగర అధ్యక్షుడు శ్రీ బొంకూరు మోహన్ గారు, శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ శ్రీ చుక్క శ్రీనివాస్ గారు వేడుకలకు హాజరయ్యారు.

ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల ప్రతినిధులు, మైనార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్ళు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ రాష్ట్ర సాధన స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్రం సాధించిన ప్రగతిని నాయకులు కొనియాడారు.