స్వచ్ఛ సర్వేక్షన్ 2021 కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్ డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో డివిజన్ కమిటీ సభ్యులు మరియు స్థానికులతో ఆమె సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో చెత్త సేకరణ, తడి, పొడి చెత్త వినియోగంపై పలువురికి అవగాహన కల్పించారు. చెత్తను కేవలం వ్యర్థంగా చూడకుండా, దానిని వినియోగానికి ఉపయోగపడేలా మార్చుకోవాలని ఆమె సూచించారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2021లో కరీంనగర్ కార్పొరేషన్‌ను ముందు వరుసలో నిలిపేందుకు అందరూ కృషి చేయాలని డిప్యూటీ మేయర్ విజ్ఞప్తి చేశారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ