డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈరోజు ఆమె డివిజన్‌లోని అన్ని షాపులలో, అలాగే రాంనగర్‌లోని కూరగాయల మార్కెట్‌ను సందర్శించారు. అమ్మకం దారులతో మాట్లాడుతూ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా, డివిజన్‌లోని వివిధ సమస్యలను గుర్తించే ప్రయత్నం చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఇంటి యజమానులకు తడి, పొడి చెత్తను వేరు వేరుగా రోజు ఇంటికి వచ్చే రిక్షా వారికి అందించాలని సూచించారు. అంతేకాకుండా, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ఆవరణలో మరియు ఇంటి ముందు చెట్లను పెంచుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక కమిటీ సభ్యులు, డివిజన్ ప్రజలు, అలాగే సంబంధిత అధికారులు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి చేపట్టిన ఈ కార్యక్రమం ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన డివిజన్‌ను ఏర్పాటు చేయాలనే ఆమె సంకల్పానికి నిదర్శనం.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ