ఎం.ఆర్. మున్నూరు కాపు సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. మంకమ్మ తోట, రాంనగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు.
ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ చల్ల హరి శంకర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు, గౌరవ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున రాజేందర్ గారు, ఎం.ఆర్. మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ నాంచారి రాజయ్య గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ వేదాంతం సత్యనారాయణ గారు ప్రత్యేకంగా హాజరై అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు.
మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించగా, భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగితేలారు. మున్నూరు కాపు సంప్రదాయాలను, కట్టుబాట్లను ప్రతిబింబిస్తూ ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ