సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు

శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లోని 37వ డివిజన్, రాంనగర్‌లో కొలువైన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన సీతారాముల కల్యాణ మహోత్సవానికి మాజీ డిప్యూటీ మేయర్ శ్రీమతి చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారు మరియు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ చల్లా హరికృష్ణ, శ్రీమతి పద్మ దంపతులు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ పుణ్యకార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల ఆశీస్సులు పొందారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ కల్యాణ మహోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.