నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారికి ఈరోజు ఘన సన్మానం జరిగింది. తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్ వారి తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో చల్ల హరిశంకర్ గారికి ‘నంది అవార్డు’ను ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, ప్రముఖులు, వివిధ రంగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ, చల్ల హరిశంకర్ గారు ప్రజాసేవలో చేసిన కృషి అపారమైనది. సామాజిక సేవలో వారి నిబద్ధత, నిస్వార్థ సేవలకు గుర్తింపుగా ఈ ‘నంది అవార్డు’ను అందించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది,” అని కొనియాడారు.
అనంతరం అసోసియేషన్ సభ్యులుహరిశంకర్ కు శాలువాతో సత్కరించి, జ్ఞాపికను, నంది అవార్డును అందజేశారు. అవార్డు స్వీకరించిన అనంతరం హరిశంకర్ గారు మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ఈ అవార్డును అందించిన తెలంగాణ ఆల్ మ్యారేజ్ బ్యూరో ఓనర్స్ అసోసియేషన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తనకు మరింత బాధ్యతను పెంచిందని, భవిష్యత్తులోనూ ప్రజా సేవలో మరింత అంకితభావంతో కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ