తెలంగాణ చౌక్‌లో రూ. 1 కోటి 20 లక్షలతో ఆధునీకరించిన అత్యాధునిక ఐలాండ్‌ను మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.. గతంలో ఉన్న జంక్షన్లు చిన్నగా, అందవిహీనంగా ఉండేవని, వాటిలో పశువులు, తాగుబోతులకు అడ్డగా ఉండేవని ఆయన అన్నారు. జంక్షన్లను ఆధునీకరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని, రూ. 8 కోట్లతో 13 జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటికే హౌసింగ్ బోర్డ్ చౌరస్తా, హెచ్‌కేఆర్ రోడ్, సదాశివపల్లి, గాంధీ రోడ్, బాబూ జగ్జీవన్‌రామ్ చౌరస్తా, మాతా శిశు ఐలాండ్‌లను ప్రారంభించుకున్నామని అన్నారు. మరో ఆరు చౌరస్తాలను సుందరీకరించేందుకు టెండర్లు పిలుస్తున్నామని, దానిలో భాగంగా కోతిరాంపూర్ చౌరస్తా, సిక్కువాడి, నాక చౌరస్తా, ఆర్టీసీ బస్టాండ్ చౌరస్తాలను ఆధునీకరిస్తామని వెల్లడించారు. జంక్షన్ల నిర్మాణం పూర్తయితే రాత్రి వేళల్లో నగరం మరింత సుందరంగా కనబడుతుందని అన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ