తెలంగాణ చౌక్‌లో ఘనంగా కేటీఆర్‌ గారి పుట్టినరోజు వేడుకలు

మాజీ మంత్రివర్యులు, బీ.ఆర్.ఎస్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్‌లో బీ.ఆర్.ఎస్. పార్టీ శ్రేణులు భారీ ఎత్తున వేడుకలు నిర్వహించాయి. గురువారం తెలంగాణ చౌక్ వద్ద బీ.ఆర్.ఎస్. పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు మరియు నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం, కేటీఆర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపెల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, మాజీ కార్పొరేటర్లు గందె మాధవి మహేష్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, ఐలేందర్ యాదవ్, వాలా రమణ రావు, కోలా మాలతి సంపత్ రెడ్డి, కంసాల శ్రీనివాస్, జడ్పి మాజీ కోఆప్షన్ సభ్యులు జమీలుద్దీన్, కొత్తపెల్లి మండల మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ పాల్గొన్నారు.

అలాగే, బీ.ఆర్.ఎస్. పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయి కృష్ణ, నగర మైనారిటీ అధ్యక్షులు షౌకత్, నగర యూత్ అధ్యక్షులు బొంకూరు మోహన్, శాతవాహన యూనివర్సిటీ విద్యార్థి విభాగం ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్, కొత్తపెల్లి మండల అధ్యక్షులు కాసారం శ్రీనివాస్, బీ.ఆర్.టీ.యూ. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర డివిజన్ అధ్యక్షులు, నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.