కేటీఆర్‌ను కలిసిన కరీంనగర్ బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు

కరీంనగర్ బీఆర్‌ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్ గారు  హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో జరిగిన గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) మహాసభ వివరాలను, పర్యటన విశేషాలను ఈ సందర్భంగా చల్ల హరిశంకర్ గారు కేటీఆర్‌కు వివరించినట్లు తెలిసింది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై బీసీ వర్గాల ఆకాంక్షలు, హక్కుల గురించి తాను చేసిన ప్రసంగం గురించి ఆయన తెలియజేశారు. విదేశీ పర్యటన ద్వారా పార్టీ, మున్నూరు కాపు సంఘం ప్రతిష్టను పెంచినందుకు కేటీఆర్ గారు చల్ల హరిశంకర్ గారిని అభినందించారని తెలుస్తోంది.

కరీంనగర్ నగరంలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.