కరీంనగర్ డిప్యూటీ మేయర్ గా చల్ల స్వరూప రాణి హరిశంకర్

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్‌గా 37వ డివిజన్ నుండి కార్పొరేటర్‌గా ఎన్నికైన చల్ల స్వరూప రాణి హరిశంకర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం పలువురు రాజకీయ ప్రముఖులు, పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ రాజకీయ వర్గాల్లో హర్షం వ్యక్తమైంది.