కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా, కరీంనగర్ పట్టణంలోని రాంనగర్ కూరగాయల మార్కెట్‌ను బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు సందర్శించి, అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని, కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అందరూ నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అరికట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావు గారు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి గారు, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గారు, వ్యవసాయ మార్కెట్ శాఖ డి.డి. పద్మావతి గారు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ