కరీంనగర్‌లోని ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (MCK) కార్యాలయ ప్రాంగణంలో మరియు మల్కాపూర్ రోడ్డులో అధునాతన సౌకర్యాలతో కూడిన స్మార్ట్ పబ్లిక్ వాష్‌రూమ్‌లను రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ బోయనపల్లి గారు ప్రారంభించారు.
నగరవాసుల, సందర్శకుల సౌలభ్యం కోసం మరియు కరీంనగర్ నగరం యొక్క పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని, నగరంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన స్మార్ట్ పబ్లిక్ వాష్‌రూమ్‌లను నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా, వర్షాకాలంలో వచ్చే ఋతు సంబంధిత వ్యాధుల వ్యాప్తిని నివారించడానికి ఉద్దేశించిన 2 ఫాగింగ్ ఆటోలను కూడా ఆయన ప్రారంభించారు. ఇది దోమల నివారణ మరియు ప్రజారోగ్య పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది .
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ