పచ్చదనాన్ని పెంచే లక్ష్యంగా సప్తగిరికాలనీలో హరితహారం

పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా, కరీంనగర్‌లోని సప్తగిరికాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు ఘనంగా జరిగింది. సప్తగిరికాలనీలోని లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో మున్సిపల్ మరియు ఐటీ శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు, బీసీ మరియు పౌర సరఫరాల శాఖ మాత్యులు గంగుల కమలాకర్ గారు, సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు కొప్పుల ఈశ్వర్ గారు పాల్గొన్నారు.