రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో కమలాకర్ గారికి ఘన స్వాగతం

అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ గంగుల కమలాకర్ గారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారితో కలిసి బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ శ్రీ చుక్క శ్రీనివాస్, కరీంనగర్ పట్టణ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు శ్రీ బొంకూరి మోహన్, కరీంనగర్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి శ్రీ గంగుల కమలాకర్ గారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, జై తెలంగాణ, జై కేసీఆర్, జై గంగుల నినాదాలతో స్వాగతం పలికారు.

తమ ప్రియతమ నాయకుడు తిరిగిరావడంతో కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ గారు తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తమ కృషి కొనసాగుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.