మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినం సందర్భంగా, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసిన అనంతరం, పూల మొక్కలు, పండ్ల మొక్కలు మరియు మిఠాయిలను పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు దిండిగాల మహేష్, కంసాల శ్రీనివాస్, గందె మాధవి మహేష్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్, నందెల్లి రమాదేవి, కుర్ర తిరుపతి పాల్గొన్నారు.
అలాగే, బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు మరియు కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని బోయినపల్లి వినోద్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ