ఆర్యవైశ్యుల కర్మకాండ నిలయానికి ప్రభుత్వ భూమి, నిధులు

సొంత స్థలం లేక ఇబ్బందులు పడుతున్న నిరుపేద ఆర్యవైశ్యులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. వారి కర్మకాండ నిలయం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమితో పాటు, SDF (స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్) నుంచి రూ. 50 లక్షల నిధులను మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.

కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ శివారులో రూ. 50 లక్షల నిధులతో నిర్మించనున్న వైశ్య కర్మకాండ భవన నిర్మాణానికి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ భవనం ఆర్యవైశ్య సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని, సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ఒక వేదికగా నిలుస్తుందని ఆర్యవైశ్య సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.