పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో 37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ గారు స్వయంగా పాల్గొని మట్టి వినాయకులను అందజేశారు.
పర్యావరణ హితమైన పండుగలను జరుపుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ నొక్కిచెప్పారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాలను వివరించారు. మట్టి వినాయకుల వాడకం ద్వారా భూమి, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని, తద్వారా పర్యావరణాన్ని భావి తరాలకు అందించవచ్చని తెలిపారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ