మేయర్ సునీల్ రావుపై అవినీతి ఆరోపణలు – సస్పెన్షన్, విచారణకు డిమాండ్

కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ సునీల్ రావుపై అవినీతి మరియు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

గత ఐదు సంవత్సరాలుగా నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలలో మేయర్ సునీల్ రావు అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, అవినీతి మేయర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.