తెలంగాణ బత్తాయి రోజును పురస్కరించుకొని, చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ గారి సమక్షంలో ఒక బత్తాయి పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు ముఖ్య అతిథిగా హాజరై బత్తాయిలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ గారు మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు, రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ గారి సూచన మేరకు కరోనా మహమ్మారిని ఎదుర్కోవాలంటే ముందుగా మనం మనోదైర్యంతో, ఆరోగ్యంతో ఉండాలని అన్నారు. బత్తాయి పండ్లను తినడం వల్ల కలిగే లాభాలను విడమర్చి చెప్పారు. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోజువారీ దినచర్య సాఫీగా సాగుతుందని అన్నారు.
కరోనా వైరస్ ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బత్తాయి పండ్లను పుష్కలంగా తినాల్సిన అవసరముందని మంత్రి నొక్కి చెప్పారు. బత్తాయి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరం చురుగ్గా ఉండటంతో పాటు ఎముకల పటుత్వం, కంటి చూపు మెరుగుపడుతుందని స్పష్టం చేశారు. స్కర్వీ వ్యాధి నివారణకు, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే బత్తాయి పండ్లు దివ్యౌషధంగా పనిచేస్తాయని ఆయన అన్నారు. బత్తాయి పండ్లను బాగా తినడం వల్ల శరీరం పోషకాలను బాగా గ్రహించి రోగనిరోధక వ్యవస్థ పెంపొందుతుందని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా, ప్రజల మేలు కోసం మంచి కార్యక్రమాలు చేపడుతున్న ఎంపీ సంతోష్ కుమార్ గారిని మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ