స్థానిక ఎన్నికల్లో చట్ట బద్దంగా బిసిలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బిసి ప్రజా ప్రతినిధుల ఫోరమ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద చేపట్టిన బిసిల మహా ధర్నా కార్యక్రమంలో కరీంనగర్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు బీసీ నాయకులు నగర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు మున్నూరు కాపు వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ గారు పాల్గొన్నారు .
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుంటే భూకంపం సృష్టించి తమ నుంచి అధికారాన్ని లాక్కుంటామని గంగుల కమలాకర్, చల్ల హరిశంకర్ అన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్(ధర్నాచౌక్) వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం (బీసీపీఎఫ్) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా ప్రేమ, వారి అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కులగణన లెక్కలు తప్పులతడకగా ఉన్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చట్టసభల్లో మాట్లాడటం లేదని, క్యాబినెట్‌లో పెట్టినా పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదన్నారు. హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారని, ఇది బ్రహ్మపదార్థం అని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వచ్చాకే సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఈ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయించాలని డిమాండ్ చేశారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ