సత్తినేని శ్రీనివాస్‌కు సన్మానం

మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సత్తినేని శ్రీనివాస్‌ను ఈరోజు కరీంనగర్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ శ్రీనివాస్‌ను అభినందించారు.

బొమ్మకల్లోని మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహంలో జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్, జిల్లా అధ్యక్షులు బొమ్మ రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి నలవాల రవీందర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం అమర్, రాష్ట్ర కార్యదర్శి పుదీరి తిరుపతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి సహా రాష్ట్ర, జిల్లా బాధ్యులు, కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులందరూ సత్తినేని శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలియజేసి, ఆయన సేవలు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు