మన కరీంనగర్ నగరాన్ని మరింత అభివృద్ధి చేయడానికి మన నాయకులు గంగుల కమలాకర్ గారి ఆద్వర్యంలో భవిష్యత్ లో ముఖ్య కార్యాచరణ చెపావుతాము. అందరి సహకారంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి ప్రగతి పథం వైపు నడిపించడానికి కృషి చేస్తాము
మౌలిక సదుపాయాల మెరుగుదల
రహదారుల విస్తరణ: నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రోడ్లను వెడల్పు చేయడం, కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు నిర్మించడానికి కార్యాచరణ చేపడుతము.
పారిశుద్ధ్యం: నగరంలో పరిశుభ్రతను పెంచడం కోసం వ్యర్థాల నిర్వహణ, మురుగునీటి శుద్ధి కేంద్రాలను మెరుగుపరచాలి. ఘన వ్యర్థాలను సక్రమంగా పారవేయడానికి బయో-మైనింగ్ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించాల కార్యాచరణ చేపడుతము
తాగునీటి సరఫరా: నగరంలోని అన్ని ప్రాంతాలకు 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని అందించే వ్యవస్థను పటిష్టం చేసేల కృషి చేస్తాము.
ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి
పర్యాటక రంగం: మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ వంటి వాటిని పూర్తి చేసి, కరీంనగర్‌ను ఒక ముఖ్యమైన పర్యాటక కేంద్రంగా మారుస్తాము. ఈ ప్రాజెక్ట్‌లను అంతర్జాతీయ స్థాయికి తీసుకురావడానికి నిధులు సమకూర్చడం, ప్రచారం కల్పించడం అవసరం.
పరిశ్రమల ఏర్పాటు: కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమకు ప్రసిద్ధి. దీనితో పాటు, కొత్త పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెచుతాము. యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడానికి కార్యాచరణ చేపడుతము.
పట్టణ ప్రణాళిక, సుపరిపాలన
పట్టణ ప్రణాళిక: నగరంలో అనధికార నిర్మాణాలను అరికట్టి, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాము. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (SUDA) వంటి సంస్థలు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాయి.
సుపరిపాలన: పౌరులకు మెరుగైన సేవలను అందించడానికి పాలనలో సాంకేతికతను ఉపయోగించడానికి ప్రణాళిక చేపడుతము. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి, వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి సభలు, ఆన్లైన్ పోర్టల్స్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ