ప్రభుత్వ బధిరుల పాఠశాల విద్యార్థులకు ఉచిత బస్ పాస్‌లు పంపిణీ

చల్లా స్వరూపరాణి హరిశంకర్ గారి పెద్ద కుమారుడు చల్లా సాకేత్ 18వ జన్మదినాన్ని పురస్కరించుకొని అరుదైన సేవా కార్యక్రమం నిర్వహించారు. రేకుర్తిలోని ప్రభుత్వ బధిరుల ఆశ్రమ పాఠశాలలో చల్లా సాకేత్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న 120 మంది విద్యార్థులకు, మరియు వారి కుటుంబ సభ్యులు కూడా ప్రయాణించేందుకు వీలుగా చల్లా బాలయ్య మెమోరియల్ ట్రస్ట్‌ నుండి  ఉచిత బస్ పాస్‌లను పంపిణీ చేశారు. బస్ పాస్‌లతో పాటు, విద్యార్థులకు పండ్లు, చాక్లెట్లు కూడా అందజేశారు.