చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆద్వర్యంలో  37వ డివిజన్ మీకోసం కార్యాలయంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ గారు స్వయంగా పాల్గొని మట్టి వినాయకులను అందజేశారు.

పర్యావరణ హితమైన పండుగలను జరుపుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ నొక్కిచెప్పారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారైన విగ్రహాల వల్ల కలిగే పర్యావరణ నష్టాలను వివరించారు. మట్టి వినాయకుల వాడకం ద్వారా భూమి, నీటి కాలుష్యాన్ని నివారించవచ్చని, తద్వారా పర్యావరణాన్ని భావి తరాలకు అందించవచ్చని తెలిపారు.