మహిళలకు విజ్ఞానాన్ని, అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో కరీంనగర్ నగరంలోని రాంనగర్లోని 37వ డివిజన్లో జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నూతనంగా మహిళా గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి హరిశంకర్ గారితో కలిసి ఈ మహిళా గ్రంథాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ మహిళా గ్రంథాలయం ద్వారా మహిళలు వివిధ పుస్తకాలు, పత్రికలు, డిజిటల్ వనరులను ఉపయోగించుకోవచ్చు. ఇది వారి జ్ఞానాన్ని పెంపొందించడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, సామాజికంగా చురుకుగా పాల్గొనడానికి ఒక వేదికగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ