మున్నూరు కాపు నాయకుల క్రికెట్ లీగ్ ద్వారా ఐక్యత, ప్రతిభకు ప్రాధాన్యత

“క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయి. ఐక్యమత్యమే యువతకు బలం. యువత తలచుకుంటే దేన్నైనా సాధించవచ్చు” అని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పురమల్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ రాజ్‌కుమార్ అన్నారు.

శుక్రవారం కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “పటేల్ క్రికెట్ లీగ్ – 2” పోటీలను మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ పురమళ్ళ శ్రీనివాస్, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ రాజకుమార్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కళ్యాడపు ఆగయ్య, గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ ప్రతినిధి జక్కుల ప్రకాష్ పటేల్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్ పటేల్ టాస్ వేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతలో ఐక్యతను పెంపొందించేందుకు, వారి ప్రతిభను వెలికితీసేందుకు పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. క్రీడలు యువతకు ఒక అద్భుతమైన వేదిక అని అభివర్ణించారు. ఈ పోటీలు కేవలం క్రీడాపరమైన ప్రతిభను మాత్రమే కాకుండా యువతలో ఐక్యత, సహకారం, లక్ష్యసాధన వంటి విలువలను కూడా పెంపొందిస్తాయన్నారు. పటేల్ క్రికెట్ లీగ్ పోటీలు మున్నూరు కాపు యువతకు స్ఫూర్తినిచ్చే ఘట్టంగా నిలుస్తాయని, ఈ క్రికెట్ పోటీలు యువతలో కొత్త ఆశయాలకు నాంది పలుకుతాయని, యువకుల ఉత్సాహానికి ఒక మంచి వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం, పటేల్ యూత్ ఫోర్స్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్ మాట్లాడుతూ, మున్నూరు కాపు యువతలో ఐక్యతను ప్రోత్సహించడం, వారి ప్రతిభను వెలికితీయడం, అలాగే క్రీడాభివృద్ధికి మద్దతు ఇవ్వడమే ఈ టోర్నమెంట్ ముఖ్య లక్ష్యం అన్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ పోటీలలో మొదటి రోజు 10 జట్లు తలపడ్డాయని, మొత్తంగా 48 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు జర్నలిస్టు ఫోరం జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శులు సూదుల వెంకటరమణ పటేల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కామినేని మధుసూదన్ పటేల్, జగిత్యాల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వగల రమేష్ పటేల్, చందు పటేల్, సహాయ కార్యదర్శి రాచమల్ల సుగుణాకర్ పటేల్, పోకల మధు పటేల్, గోలి రవి పటేల్, యూత్ ఫోర్స్ కోర్ కమిటీ సభ్యులు గాజుల శ్రీనివాస్ పటేల్, కట్ల మహేందర్ పటేల్, పోరెల్ల నిఖిల్ పటేల్, గుమ్మడి అరుణ్ తదితరులు పాల్గొన్నారు.