37వ డివిజన్ అభివృద్ధికి అవిరళ కృషి చేసిన కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి చల్లా హరిశంకర్ దంపతులకు రాజేశ్వర కాలనీ ప్రజలు ఘన సన్మానం చేశారు. వారి పదవీకాలం విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
రాజేశ్వర కాలనీ పెద్దలు, మహిళలు, కాలనీవాసులు అందరూ కలిసి మాట్లాడుతూ, చల్లా స్వరూప రాణి-హరిశంకర్ దంపతులు తమ కర్మభూమిలో పుట్టిన కారణజన్ములని కొనియాడారు. “మన డివిజన్ అభివృద్ధే ధ్యేయంగా నిబద్ధత, అంకితభావంతో తపనపడే ప్రజా సేవకులు మీరు. కుంటుపడిన డివిజన్, నగర అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి అపారం” అని ప్రశంసించారు.
“మీరు మాకు, డివిజన్‌కు పెద్దదిక్కుగా, తోడుగా, నీడగా, మా కష్టాల్లో, ఆనందంలో అనునిత్యం మాతో ఉంటూ, మీరు పోషించిన పాత్ర అమూల్యం” అని కాలనీవాసులు పేర్కొన్నారు. 37వ డివిజన్ ఏకగ్రీవ కార్పొరేటర్‌గా, కరీంనగర్ నగర డిప్యూటీ మేయర్‌గా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నగరం, 37వ డివిజన్ అభివృద్ధి కోసం చల్లా స్వరూప రాణి చేసిన కృషి అనితరసాధ్యమని ప్రజలు గుర్తు చేసుకున్నారు.
డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపిన వారి వెంటే తాము ఉంటామని హామీ ఇస్తూ, భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని రాజేశ్వర కాలనీ ప్రజలు ఆకాంక్షించారు. ఈ సన్మానం చల్లా స్వరూప రాణి – హరిశంకర్ దంపతుల ప్రజాసేవకు గుర్తింపుగా నిలిచింది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ