తెలంగాణ చౌక్‌లో ఘనంగా కేసీఆర్ 71వ జన్మదిన వేడుకలు

తెలంగాణ ఉద్యమ వ్యూహకర్త, బంగారు తెలంగాణ రూపశిల్పి, అపర భగీరథుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి 71వ జన్మదిన వేడుకలు కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో ఘనంగా జరిగాయి. నగర బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా, 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని 71 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. అనంతరం మిఠాయిలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, కరీంనగర్ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు జి.వి. రామకృష్ణ రావు గారు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు పాల్గొన్నారు.