Achievements

  • అవినీతి రహిత పాలనను అందించడానికి నిత్యం ప్రజలకు ఎలాంటి అవాంతరాలు లేకుండా  కృషి చేశాము.
  • డివిజన్లవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేశాము.
  • హైమస్ట్ వీధి దీపాలను ప్రధాన కూడళ్లతో పాటు ప్రతీ వీధిలో ఏర్పాటు చేసుకున్నాం.
  • ప్రతీ వీధిలో సిమెంట్ రోడ్లు వేసుకోవడంతో పాటు  డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపర్చడానికి కృషి చేశాము.
  • డంపుయార్డ్ లను ఆధునికరించి సరికొత్త పరికరాలను ఉపయోగిస్తూ ఇళ్ల నుండి  చెత్త సేకరిస్తూ  నగర శుభ్రతకు  కృషి చేశాము.
  • పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమాల ద్వారా  తడి – పొడి చెత్తపై  అవగాహన కల్పిస్తూ  ప్రతీ ఇంటికి బుట్టలు ఇవ్వడం జరిగింది.
  • డివిజన్ వారీగా ప్రజలను నేరుగా కలసి వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేశాము.
  • కౌన్సిల్ సమావేశాలను సక్రమంగా నిర్వహించి అందరి మన్ననలు పొందడం జరిగింది.
  • హరితహారంలో భాగంగా వేలాది చెట్లను నాటడం జరిగింది.
  • నగర కౌన్సిల్ సభ్యులు మరియు విభాగాధిపతులతో కలిసి పని చేస్తూ, ప్రజల అవసరాలను తీర్చడానికి విధానాలను రూపొందించడం జరిగింది
  • కరోనాలాంటి మహమ్మారి వేళ దాతల సహకారంతో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా వేలాదిమందికి నిత్య అవసర వస్తువులు, బియ్యం మరియు కూరగాయలు అందించడం జరిగింది.
  • కరోనా సమయంలో చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ప్రతిరోజూ అన్నదాన  కార్యక్రమం నిర్వహించడం జరిగింది