రేనే హాస్పిటల్ మహిళా దినోత్సవం వేడుకల్లో గంగుల రజిత, చల్ల స్వరూప రాణి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రేనే హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు బీసీ సంక్షేమ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారి సతీమణి గంగుల రజిత గారు, నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణి హరిశంకర్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళల ప్రాముఖ్యతను, వారి సాధికారతను ఈ వేదికపై ప్రముఖంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, ఇతర మహిళా ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొని మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.