చల్ల హరి శంకర్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదిగి సమాజానికి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి. ఆయన జీవితం నేటి యువతకు స్ఫూర్తినిస్తుంది.
బాల్యం, విద్యాభ్యాసం
ఆయన ప్రాథమిక విద్యను బోనాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేశారు. ఉన్నత విద్య కోసం సిరిసిల్ల పట్టణానికి వచ్చి, సాహిత్య విద్యా నికేతన్ మరియు వివేకవర్ధిని పాఠశాలల్లో 6, 7 తరగతులు చదువుకున్నారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (ZPHS), సిరిసిల్లలో 8, 9, 10 తరగతులు చదివారు. ఇంటర్మీడియట్ విద్యను సిరిసిల్ల ప్రభుత్వ కళాశాలలో పూర్తి చేశారు.
నిర్మాణ రంగంలో కృషి
చల్ల హరి శంకర్ 1998లో కాంట్రాక్టర్‌గా తన వృత్తి జీవితాన్ని మొదలుపెట్టారు. కష్టపడి పనిచేసి, తన వృత్తిలో ఉన్నత స్థానానికి ఎదిగారు. కాంట్రాక్టర్‌గా ఉన్న సమయంలో సుమారు 1000 మందికి ఉపాధి కల్పించారు. ఇది ఆయనలోని నాయకత్వ లక్షణాలను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. కరీంనగర్ నగరంలో 15 సంవత్సరాల పాటు పారిశుద్ధ్య కాంట్రాక్టును విజయవంతంగా నిర్వహించి, నగర పరిశుభ్రతకు ఎంతో కృషి చేశారు.
తన తండ్రి చల్ల బాలయ్య 2013 జనవరిలో అకాల మరణం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానంతరం ఆయన పేరు మీదుగా “చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్”ను స్థాపించారు. ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నేటికీ కొనసాగిస్తూ ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలబడుతున్నరు. చల్ల హరిశంకర్ కుటుంబం చల్ల బాలయ్య మెమోరియల్ ట్రస్ట్ ద్వారా డివిజన్ తో పాటుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.
తెలంగాణ ఉద్యమం, స్వరాష్ట్ర సాధన దిశగా సాగుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీలో చల్ల హరి శంకర్ గారు ఉద్యమ స్ఫూర్తిగా కరీంనగర్ శాసన సభ్యులు ప్రజా అభిమాన నాయకుడు శ్రీ గంగుల కమలాకర్ నాయకత్వాన్ని బలపరిచి,పార్టీ సీనియర్ నాయకులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరి క్రియాశీలక సభ్యత్వం స్వీకరించడం జరిగింది.
తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2014లో కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో స్వరూప హరిశంకర్ అభ్యర్థిత్వాన్ని ధృవ పరిచి 41వ డివిజన్ తెరాస పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుపగా, డివిజన్ లోని ప్రజలు, వారి కుటుంబ సేవలను గుర్తించి, నగర పాలక సంస్థ ఎన్నికల ఫలితాల్లో రికార్డు మెజారిటీతో గెలిపించారు. కార్పోరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసి ప్రజలకు నిత్యం సేవ చేస్తూ మరింత చేరువయ్యారు.
డివిజన్ ప్రజలకు పూర్తి స్థాయిలలో సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి నిత్యం ప్రజా సేవకై ప్రతి అడుగు డివిజన్ అభివృద్ధికి అనే నినాదంతో అందరికీ అందుబాటులో ఉండాలనే సంకల్పంతో మీ కోసం డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నగర పాలక సంస్థకు సంబంధించిన పౌర సేవలు మరియు ప్రజ అవసరాలకు ఉపయోగపడే పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన సేవలు డివిజన్ ఆర్జీదారులకు అందజేస్తూ వాటికి సంబంధించి ధోరణులను మరియు మీ సేవ రుసుములను మీ కోసం కార్యాలయం ద్వారానే చెల్లిస్తూ, డివిజన్ లోని ఆర్జీదారులకు ఏవిధమైన ఇబ్బంది లేకుండా చూస్తూ త్వరితగతిన సేవలను అందజేస్తున్నారు .
బిఆర్ఎస్ పార్టీలో క్రియశీలకంగా పనిచేస్తూ గంగుల కమలాకర్ గారి అడుగులో అడుగు వేస్తూ రాష్ట్ర నాయకత్వం కెసిఆర్ , కేటీఆర్ గారికి సూపరిచితులయ్యారు. కష్ట కాలంలో పార్టీ తరపున అనేక కార్యక్రమాలు చేస్తూ కేటీఆర్ గారికి మరింత చేరువైనా చల్ల హరి శంకర్ గారికి భారత రాష్ట్ర సమితి (BRS) కరీంనగర్ అధ్యక్షుడిగా బాధ్యతలు కట్టబెట్టారు.
పార్టీ పరంగానే కాకుండా హరిశంకర్ గారు తన జాతి పట్ల ఎంతో గౌరవంగా ఉంటూ కుల బంధవుల కోరిక మేరకు తెలంగాణ మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాద్యతలు చేపట్టారు. రాజకీయాలతో పాటు, క్రీడా రంగంలో కూడా ఆయనకు అనుభవం ఉంది. బేస్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అధ్యక్షుడిగా కూడా, క్రీడల అభివృద్ధికి తన వంతు కృషి చేశారు. కష్ట సమయంలో ఇటు పార్టీకి అటు కుల సంఘాల కార్యక్రమలలో చురుకుగా పనిచేస్తూ ట్రబుల్ షూటర్ గా పేరు తెచ్చుకున్న హరి శంకర్ గారు ఎన్నో సమస్యలను చాలా సులువుగా పరిష్కరించారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ