కరీంనగర్‌లో అర్బన్ మిషన్ భగీరథ : ప్రతిరోజు నీటి సరఫరా

కరీంనగర్ నగర ప్రజలకు నిరంతరాయంగా ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో చేపట్టిన అర్బన్ మిషన్ భగీరథ పథకాన్ని ఈరోజు ఘనంగా ప్రారంభించారు. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మాత్యులు శ్రీ కేటీఆర్ గారు ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.

కరీంనగర్ ప్రజలకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఈ పథకం ఒక కీలక అడుగు . ఈ పథకం ద్వారా నగరంలోని ప్రతి ఇంటికీ సురక్షితమైన త్రాగునీరు అందుబాటులోకి వస్తుంది.