మార్కెఫెడ్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, యువజన సంఘాల నేత, సామాజిక సేవా తత్పరుడు, సీనియర్ తెరాస నేత, జనహృదయ నేత శ్రీ చల్ల హరిశంకర్ గారికి ఇంటర్నేషనల్ గ్లోబల్ పీస్ యూనివర్సిటీ డాక్టరేట్‌ను ప్రకటించిన శుభ సందర్భంగా, మార్క్‌ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ ఆయనను ఘనంగా సన్మానించింది.
ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మరియు సభ్యులు పాల్గొని శ్రీ హరిశంకర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు కల్వకుంట్ల ప్రమోద్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, వైస్ ప్రెసిడెంట్ ఉమా శంకర్, మరియు ఇతర గౌరవ సభ్యులు ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
శ్రీ చల్ల హరిశంకర్ సమాజానికి అందిస్తున్న సేవలు, యువజన సంఘాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి, రాజకీయ రంగంలో ఆయన అనుభవం, ముఖ్యంగా మార్క్‌ఫెడ్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఆయన చేస్తున్న మార్గదర్శకత్వానికి గుర్తింపుగా ఈ డాక్టరేట్ లభించిందని పలువురు కొనియాడారు. ఈ సన్మానం పట్ల శ్రీ చల్ల హరిశంకర్ హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో కూడా ప్రజా సేవకు అంకితమవుతానని తెలిపారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ