దేశ రాజకీయాల్లో మున్నూరు కాపుల పాత్ర గొప్పది

మున్నూరు కాపుల ముద్దుబిడ్డ, గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, పాండిచ్చేరి తొలి గవర్నర్ సాయాజీ శీలం లక్ష్మణ్ గారి 45వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లో ఘన నివాళులు అర్పించారు. మున్నూరుకాపు విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు కొత్త అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వాతంత్ర్య సమరంలో, ఆధునిక భారతదేశ నిర్మాణంలో శీలం లక్ష్మణ్ అందించిన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా మున్నూరుకాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరి శంకర్ గారు సాయాజీ శీలం లక్ష్మణ్ గారి జీవిత చరిత్రను వివరించే కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం చల్ల హరి శంకర్ మాట్లాడుతూ, “స్వతంత్ర పోరాటంలోనే కాకుండా ఆధునిక భారత దేశ రాజకీయాల్లో మున్నూరు కాపుల పాత్ర అనిర్వచనీయమైనది. ఎందరో మున్నూరు కాపు వైతాళికులు అందించిన స్ఫూర్తిని కొనసాగిస్తామని” తెలిపారు.

ఈ కార్యక్రమంలో నలువాల రవీందర్, సత్తినేని శ్రీనివాస్, ముప్పిడి సునీల్, బండి ప్రశాంత్ కుమార్, బొల్లం లింగయ్య, డి సంతోష్ పటేల్ తో పాటు మున్నూరు కాపు విద్యావంతుల వేదిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సీఎం లక్ష్మణ్ గారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం మున్నూరు కాపు సమాజంలో స్ఫూర్తిని నింపి, భవిష్యత్తు తరాలకు ఆయన ఆదర్శప్రాయమైన జీవితాన్ని పరిచయం చేసింది.