కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేసింది ! మరి అసలు నిజం ఏమిటి ?

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబరులో అధికారం చేపట్టిన తర్వాత, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రకటించింది. కానీ నేటి వరకు కూడా హామీలు నెరవేర్చలేదు !

ఉచిత బస్సు ప్రయాణం: మహిళలు TSRTC బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. కానీ తక్కువ సర్వీసులు నడుపుతూ తెలంగాణ ఆడపడుచుల మద్య గొడవలు అయ్యే విదముగా వ్యవహరిస్తున్నారు ! పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులకు మాత్రమే ఈ పథకం అమలు చేసి ప్రజలను మోసం చేశారు.

రూ. 500 గ్యాస్ సిలిండర్: అర్హులైన లబ్ధిదారులకు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్ వివరాలు, ఆధార్ అనుసంధానం వంటి ప్రక్రియలతో లింకు చేసి చాలామంది ప్రజలను అనర్హులగా ప్రకటించి పేద ప్రజల ఆశల మీద నీళ్ళు చల్లారు.

నెలకు రూ. 2,500 ఆర్థిక సహాయం: దీనికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ పూర్తయింది, అయితే ఏదో ఒక మాట చెపుతూ డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ఈ పథకానికి పూర్తిగా పంగాణమం పెట్టారు.

గృహ జ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్):

అర్హులైన కుటుంబాలను జాబితా నుండి తొలగించి కొంతమందికే పథకం వర్తింప జేస్తూ మిగిలిన ప్రజల విద్యుత్ ఛార్జీలు తడిసి మోపెడు చేస్తూ  ప్రజల జీవితలను, విధ్యుత్ వ్యవస్త ను చిన్న భిన్నం చేశారు .

ఇందిరమ్మ ఇళ్లు (ఇళ్లు లేని వారికి రూ. 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం):

ఈ పథకం తూ  తూ  మంత్రంగా మొదలు పెట్టి ప్రజల మద్య చిచ్చు రేపారు . తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తాం అని మోసం చేశారు .

యువ వికాసం (విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు, అంతర్జాతీయ పాఠశాలలు):

రూ. 5 లక్షల విద్యాభరోసా కార్డు హామీ ఇంకా అమలు కాలేదు. దీనికి సంబంధించిన విధివిధానాలు కూడా మొదలు కాలేదు.

ప్రతి మండలంలో తెలంగాణ అంతర్జాతీయ పాఠశాలల ఏర్పాటు హామీ కూడా ఇంకా అమలు కాలేదు.

చేయూత (పెన్షన్ పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు):

ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంపు పాక్షికంగా అమలవుతోంది.

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ల పెంపు : పెన్షన్ల పెంపు హామీ ఇంకా అమలు కాలేదు. దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టలేదు .

రైతు భరోసా (రైతులకు రూ. 15,000, కౌలు రైతులకు రూ. 15,000, వ్యవసాయ కార్మికులకు రూ. 12,000, వరి పంటకు రూ. 500 బోనస్):

ఈ హామీలు ఇంకా అమలు కాలేదు. వాటి ఊసు కూడా లేదు ! రైతుల నోట్లో మట్టి కొట్టి ఊసురు పోసుకుంటున్నారు. తులం బంగారం తుస్సుమనిపించారు.