బేస్ బాల్ సీనియర్ టోర్నమెంట్ కొరకు తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక

4వ అంతర్జాతీయ బేస్ బాల్ సీనియర్ టోర్నమెంట్ కొరకు తెలంగాణ రాష్ట్ర జట్టును ఎంపిక చేసే ప్రక్రియ ఈరోజు సికింద్రాబాద్‌లోని పీజీ కాలేజ్ గ్రౌండ్‌లో విజయవంతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్ర బేస్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ స్టేట్ టీం సెలక్షన్ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చల్ల హరిశంకర్ గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చల్లా హరిశంకర్ గారు క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని మద్దతును అసోసియేషన్ అందిస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణ నుండి ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఈ సెలక్షన్ ప్రక్రియలో బేస్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్వేతా గారు, ట్రెజరర్ డాక్టర్ కృష్ణ గారు, సెలక్షన్ కమిటీ చైర్మన్ నరేష్ గారు, పాషా గారు, అలాగే రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి వచ్చిన జిల్లా సెక్రటరీలు, కోచ్‌లు మరియు ప్రతిభావంతులైన క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రీడాకారుల నైపుణ్యాలను, ప్రతిభను క్షుణ్ణంగా పరిశీలించి అంతర్జాతీయ టోర్నమెంట్‌కు రాష్ట్ర జట్టును ఎంపిక చేశారు.