కరీంనగర్ జిల్లా మాజీ గ్రంధాలయ చైర్మన్ శ్రీ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ గారి వివాహ వేడుకకు బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శ్రీ చల్లా హరిశంకర్ గారు, కరీంనగర్ మాజీ డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప రాణి గారు హాజరయ్యారు. ఈ శుభకార్యానికి విచ్చేసిన చల్లా హరిశంకర్ గారు స్వరూప రాణి గారు నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన దంపతుల వివాహ జీవితం ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో సాగాలని చల్లా హరిశంకర్ గారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనిల్ కుమార్ గౌడ్ ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటున్నారని, భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆశీర్వదించారు.
ఈ వివాహ వేడుకకు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనిల్ కుమార్ గౌడ్ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుక కుటుంబ సభ్యుల, స్నేహితుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగింది.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ