ఆల్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ – రెబల్ స్టార్ కృష్ణంరాజు మెమోరియల్ కప్ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు శ్రీ చల్లా హరిశంకర్ గారికి ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన సినీ నటులు హీరో సుమన్ గారు మరియు దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి శ్యామలాదేవి గారు సంయుక్తంగా చల్లా హరిశంకర్‌ను శాలువా, గజమాలతో సత్కరించారు.
కరాటే ఛాంపియన్‌షిప్ వేదికపై జరిగిన ఈ సన్మాన కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా హీరో సుమన్ గారు మాట్లాడుతూ, కరాటే వంటి క్రీడలను ప్రోత్సహించడం యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న చల్లా హరిశంకర్ గారిని అభినందించారు.
శ్రీమతి శ్యామలాదేవి గారు మాట్లాడుతూ, రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి పేరున ఏర్పాటు చేసిన ఈ ఛాంపియన్‌షిప్‌కు చల్లా హరిశంకర్ గారి వంటి నాయకుల మద్దతు లభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆయన సామాజిక సేవ, క్రీడాభివృద్ధి పట్ల చూపుతున్న ఆసక్తిని ప్రశంసించారు.
ఈ సందర్భంగా శ్రీ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ, క్రీడలకు, ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్‌కు తనవంతు మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తనను సత్కరించిన హీరో సుమన్ గారికి, శ్యామలాదేవి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరాటే అకాడమీ నిర్వాహకులు, క్రీడాకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ