ఇటీవల మరణించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు గోస్కి అజయ్ గారి తల్లి లక్ష్మి గారి చిత్రపటానికి మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ గారు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు శ్రీ చల్ల హరిశంకర్ గారు ఈరోజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గోస్కి అజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ, లక్ష్మి గారి మరణం గోస్కి కుటుంబానికి తీరని లోటని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గోస్కి కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శ్రీ ఐలెంధర్ యాదవ్, శ్రీ దిండిగాల మహేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ కర్ర సూర్య, శ్రీ నేతి రవివర్మ, శ్రీ మిడిదొడ్డి నవీన్ కుమార్, శ్రీ చేతి చంద్రశేఖర్, శ్రీ డీఎస్పీ, శ్రీ అంజి యాదవ్, శ్రీ తునికి రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. వీరందరూ గోస్కి లక్ష్మి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ