బండి పై ఫైర్ అయినా చల్లహరిశంకర్

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనకు బాధ్యుడు బండి సంజయ్ అని ఆరోపిస్తూ, లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనకు కారణమైన బండి సంజయ్ తన ఎంపీ పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గతంలో లక్ష రూపాయల లంచం ఆరోపణలు వచ్చినప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్‌ను పదవి నుంచి తొలగించిన విషయాన్ని చల్లా హరిశంకర్ గుర్తుచేశారు. “నేడు నాలుగున్నర లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పదో తరగతి పేపర్ లీక్ కేసులో అడ్డంగా దొరికి, కేసులో ఇరుక్కున్న బండిని పదవి నుండి తప్పించరా?” అని ప్రశ్నించారు. విద్యార్థులు చదివి ఉద్యోగాలు సంపాదించుకుని బంగారు భవిష్యత్తును పొందాలని ప్రభుత్వం ఆరాటపడుతుంటే, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసి బీజేపీని తిరగకుండా చేశారని గతంలో బండి సంజయ్ ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఇప్పుడాయనే పేపర్ల లీకులకు పాల్పడటం యువత సన్మార్గంలో నడవకుండా చేయాలనే కుట్రలా స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఆరోపించారు.

“దొంగే దొంగా దొంగా అన్నట్లు ఉంది బండి సంజయ్ పరిస్థితి,” అని చల్లా హరిశంకర్ ఎద్దేవా చేశారు. TSPSC లీకుల విషయంలో సెల్ ఫోన్ ఇస్తే పోలీసులు లీకులను కూడా పట్టుకునే అవకాశం ఉందని కోరినా, బండి సంజయ్ తన ఫోన్‌ను పోలీసులకు ఇవ్వలేదని గుర్తుచేశారు. నిజంగా తప్పు చేయకపోతే సెల్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలని ఆయన సూచించారు. సిద్ధాంతాలు కలిగిన పార్టీ అని చెప్పుకునే బీజేపీ, నేడు చేసే ఇలాంటి కుట్రలు ఏ సిద్ధాంతం కిందకు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఉన్నతమైన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పేపర్ లీక్ చేసి అడ్డంగా దొరికిపోవడం ద్వారా గెలిపించిన కరీంనగర్ ప్రజల పరువు తీస్తున్నారని చల్లా హరిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశం కోసం, ధర్మం కోసం అంటే విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమేనా అని ప్రశ్నించారు. బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉండి, పేపర్ తనకు రాగానే పోలీసులకు చెప్పి, పంపిన వాడిని పట్టుకోమని చెప్పకుండా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పంపి ఆందోళన చేపట్టాలని చెప్పడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. అధికారంలోకి రావాలంటే అవకాశం ఇవ్వాలని ప్రజలను వేడుకోవాలి, ఒప్పించాలి తప్ప, తానే పేపర్ లీకు చేయించి, లీకులను అరికట్టాలని ప్రభుత్వం అంటూ ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్య అని పునరుద్ఘాటించారు.

చివరగా, బండి సంజయ్ బేషరతుగా తెలంగాణ ప్రజలకు, విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పి, అడ్డంగా దొరికిపోయినందున వెంటనే పదవికి రాజీనామా చేయాలని చల్లా హరిశంకర్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర యూత్ అధ్యక్షులు దీకొండ కుల్దీప్, యూత్ ప్రధాన కార్యదర్శి సాయి, మైనార్టీ నగర అధ్యక్షులు మీర్ షౌకత్ అలీ, మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్, 37వ డివిజన్ అధ్యక్షుడు అరే రవి గౌడ్, అలాగే పార్టీ నాయకులు గుగిళ్ళ శ్రీనివాస్, గూడూరి మురళి, రవినాయక్, నేతి రవి వర్మ, MD. కరీం, MD. ఆఫ్రోజ్, చిగిరి శోభ, గంటల రేణుక తదితరులు పాల్గొన్నారు.