మున్నూరు కాపు సంఘం ఓరియంటేషన్ శిక్షణ

హైదరాబాద్ చందానగర్‌లోని సుప్రజ హోటల్‌లో మున్నూరు కాపు సంఘం తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ శిక్షణ శిబిరంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ చల్ల హరిశంకర్ గారికి సన్మానం చేసి మున్నూరు కాపులను గ్రామ స్థాయి నుంచి సంఘటితం చేసి ఏకతాటిపైకి నడిపించేందుకు కృషి చేయాలని అన్నారు. మున్నూరు కాపులు రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగాలనీ అభివృద్ధి దిశగా పయనించాలని పేర్కొన్నారు. ఓరియంటేషన్ శిక్షణ తరగతిలో చల్ల హరిశంకర్ మాట్లాడుతూ రాబోయే రోజులలో మున్నూరు కాపు ఉద్యమం తరాస్తాయికి  తీసుకవెళ్ళి  జాతి హక్కులను కాపాడటానికి ఎంతటి పోరాటానికైనా  సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.