హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతుల మీదుగా సన్మానం

కీ.శే వంగవీటి మోహన రంగా గారి 78 వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి చేతుల మీదుగా మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన చల్ల హరి శంకర్ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘo తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పుట్ట పురుషోత్తం గారు, మహిళ అధ్యక్షురాలు బండి పద్మ గారు, కాపు జాగృతి అధ్యక్షులు చందు జనార్దన్ గారు కుల బంధావులు పాల్గొన్నారు.