మున్నూరు కాపు సంఘo తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా చల్ల హరిశంకర్

మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా చల్ల హరిశంకర్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్నూరుకాపు సంఘం గౌరవ  అధ్యక్షుడు వద్దిరాజు రవిచంద్ర చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.  ఎన్నికల ప్రధానాధికారులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ, విశ్రాంత ఐఆర్ఎస్అధికారి మంగపతిబాబు, విశ్రాంత జాయింట్ కలెక్టర్ ఎర్రా నాగేంద్రబాబు వ్యవహరించారు.