మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన చల్ల హరిశంకర్ గారికి శుభాకాంక్షలు తెలియ జేసిన రాజ్యసభ సభ్యులు( ఎం.పి) పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర గారు, మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు గంగుల కమలకర్ గారు.
రాష్ట్రంలో కులగణన పేరుతో జరిపిన సర్వేలో తాము తప్ప ఇతరులు ప్రభావశీలురుగా ఉండకూడదని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగా కుట్రలు చేశారనే అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించిన మేరకు 10 లక్షల మందితో మున్నూరుకాపుల కదనభేరిని మోగిద్దామని పిలుపునిచ్చారు.
రాజకీయాలకు, పార్టీలకతీతంగా కులాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ‘ఖబర్దార్.. రేవంత్‌రెడ్డీ! మున్నూరుకాపులను తక్కువ చేసి చూపెట్టారు. ఇంతకు ఇంత అనుభవిస్తారు. ప్రజాక్షేత్రంలో దీనికి ప్రతిఫలం అనుభవిస్తారు. బలవంతుడిని బలహీనపర్చే, రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడంలో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారు. పాలకుల కుట్రలు, కుయుక్తులను ఛేదించుకుంటూ రాజ్యాధికారం సాధించుకునే దిశగా ఆత్మైస్థెర్యంతో ముందుకుసాగుదాం’ అని పిలుపునిచ్చారు
Challa Harishankar జై మున్నూరుకాపు .. జై కరీంనగర్ .. జై తెలంగాణ