బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే..

వచ్చే ఎన్నికల్లో బల్దియాపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని  బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ అన్నారు .  నగరపాలక సంస్థ విడుదల చేసిన జాబితాలో ప్రతీ డివిజన్లో 5000 ఓటర్లు ఉన్నట్టు చూపించినారని వారు చూపించిన ఇంటి నెంబర్ల ప్రకారం ఓటర్ లిస్టును పరిశీలించగా కొత్తగా వారు తెలిపిన 20వ డివిజన్‌లో 3000 ఓటర్లు, 63వ డివిజన్‌లో 2000 ఓట్లు మాత్రమే ఉన్నాయని హరిశంకర్  పేర్కొన్నారు.

66 డివిజన్‌లో వారు చూపించిన ఓటర్ లిస్టుకు ఇప్పుడు కరీంనగర్‌ అందుబాటులో ఉన్న ఓటర్ లిస్టుకు ఎక్కడ కూడా పొంతన కలవడం లేదన్నారు. ప్రభుత్వం మరి అధికారులు తూతూ మంత్రంగా రాత్రికి రాత్రి వారికి నచ్చిన విధంగా డివిజన్లను డిలిమిటేషన్ చేసి ప్రజలను, నాయకులను అయోమయానికి గురి చేస్తున్నారని.. అధికారులపై వెంటనే చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన ఏదైనా ఏజెన్సీతో డీలిమిటేషన్ ప్రక్రియ చేపించవలసిందిగా హరిశంకర్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 13 గెలిస్తే కాంగ్రెస్ సున్నా స్థానాలకు పరిమితమైందన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు సున్నా బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత కాంగ్రెస్‌దన్నారు. శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను ఎందుకు డిస్టర్బ్‌ చేస్తున్నారని విమర్శించారు. తప్పుడు ముసాయిదాపై కలెక్టరును కలిసి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతామని.. స్పందన లేకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు.