సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నాడు, మాజీ మంత్రి, కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు 168 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం ₹37,86,500 విలువ గల ఈ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, అనారోగ్యం లేదా ఆపదలో ఉన్న ప్రజలకు సీఎం ఈ  ఫండ్ ఒక గొప్ప ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ఈ నిధులు లబ్ధిదారుల వైద్య ఖర్చులకు ఎంతో సహాయపడతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.